Tuesday, October 8, 2024

Fire accident – పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సెట్లో అగ్నిప్రమాదం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు హైదరాబాద్‌లోని దుండిగల్‌ పరిధిలోని బౌరంపేట్‌లో ఆదివారం అర్ధరాత్రి షూటింగ్‌ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన చిత్రయూనిట్‌ వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు.హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సెట్‌లో మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్‌ కూలగా దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement