Saturday, June 12, 2021

కాజా టోల్ ప్లాజా వద్ద భారీ అగ్నిప్రమాదం

గుంటూరు మంగళగిరి మండలంలోని కాజా టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న ఓ లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో టోల్ గేట్ సిబ్బంది పరుగులు తీసి దూరంగా వెళ్లిపోయారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా అగ్నిప్రమాదం ఘటన వల్ల కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News