Thursday, March 28, 2024

సుందర్‌ పిచాయ్‌పై ఎఫ్‌ఐఆర్‌..

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై మహారాష్ట్రలో ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. కాపీ రైట్‌ ఉల్లంఘనపై కోర్ట్‌ ఆదేశాల మేరకు ఎంఐడీసీ(మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) స్టేషన్‌లో పిచాయ్‌తోపాటు మరో ఐదుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. డైరెక్టర్‌ – ప్రొడ్యూసర్‌ సునీల్‌ దర్శన్‌ ఫిర్యాదు మేరకు కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

2017లో విడుదలైన తన ఏక్‌ హసీనా థీ ఎక్‌ దివానా థా సినిమాకు సంబంధించి ఎలాంటి హక్కులు ఇవ్వకపోయినా గూగుల్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌ ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిందని దర్శన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement