Thursday, April 25, 2024

ఫైన్ల వెూత.. మ‌రింత పెర‌గ‌నున్న జ‌రిమానాలు.!?

ఒకప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు ప్రదాన కూడళ్లలో పలు ట్రాఫిక్‌ పాయింట్లలో వాహనాలను తనిఖీలు చేసేవారు. నిభంధనలు ఉల్లంగిస్తే ఫైన్లు రాసేవారు. కానీ ఇప్పుడు అదునాతన సాంకేతిక సహాయంతో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులందరికి కెమేరాలు అందజేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాన్ని అప్పుడే కెమేరాలతో క్లిక్‌ మనిపించి నిబంధనలకు అనుగుణంగా ఈ-చలాన్‌ విధిస్తున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం…

ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల ఒకటి నుంచి జరిమానాలు మరింత భారీగా పెరుగనున్నట్లు సమాచారం. రవాణాశాఖ ప్రతిపాధనలకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మైనర్లకు లౌసెన్స్‌ లేనివారికి వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు, యజమానులకు జరిమాన విధించడమే కాకుండా జరిమానాలు వేస్తున్నారు. ఈ జరిమాన సొమ్మును మరింత పెంచనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న సాధారన చేతి కెమేరాలే కాకుండా షర్టు బటనుకు చిన్నపాటు కెమేరాలు వచ్చాయి. ట్రాఫిక్‌ ఉల్లంగించిన సమయంలో పోలీస్‌ సిబ్బంది ఫోటోలు తీస్తుండడంతో అది చూసిన వాహనదారులు గొడవలు పడుతున్నారు. దీంతో షర్టుకు పెట్టుకునే ఆదునిక కెమేరాలను వీరికి అందజేస్తున్నారు.

పార్కింగ్‌ ప్లేస్‌ లేకపోవడం…

నమోదు అవుతున్న కేసుల్లో రాంగ్‌ పార్కింగ్‌ అధికంగా ఉంటున్నాయి. పార్కింగ్‌కు ప్రత్యేకించి స్థలం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుందని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల తప్ప ఎక్కడా పార్కింగ్‌ స్థలాలు అందుబాటులో లేవు. క్షణాల వ్యవదిలో పనిపూర్తి చేసుకునే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఇష్టం వచ్చినట్లు ఫైన్లు విధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement