Thursday, April 25, 2024

రేపటినుంచే హాకీ ప్రపంచకప్‌ టోర్నీ..

2023 పురుషుల ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్‌ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. కాగా మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఘనంగా ఆరంభమైంది. బుధవారం కటక్‌లోని బారాబటి స్టేడియంలో ప్రపంచకప్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

గురువారం రూర్కెలాలో జరిగిన మ్యాచ్‌ స్పెయిన్‌తో ప్రారంభమైంది. మన దేశం 1971లో ప్రారంభ టోర్నమెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. తర్వాతి 1973లో రజతం సాధించింది. 1975లో అజిత్‌పాల్‌ సింగ్‌ జట్టును గెలిపించాడు. కానీ అప్పటి నుండి భారత్‌ కనీసం సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement