Tuesday, April 23, 2024

ఫిఫా అండర్‌ 17 విమెన్స్‌ వరల్డ్‌ కప్.. గ్రూప్‌ ఏలో భారత్‌

ఫిఫా అండర్‌ 17 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ గ్రూప్‌-ఏలో ఆడనుంది. గ్రూప్‌-ఏలో యునైటెడ్‌ స్టేట్స్‌, బ్రెజిల్‌, మొరాకో జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్‌ 11 నుంచి 30 వరకు అండర్‌ 17 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, శుక్రవారంనాడు జురిచ్‌లోని ఫిఫా కేంద్ర కార్యాలయంలో డ్రా తీసి, గ్రూప్‌ల వారీగా జట్లను విభజించారు. అక్టోబర్‌ 11న భారత జట్టు యునైటెడ్‌ స్టేట్స్‌తో తలపడనుంది.

గ్రూప్‌-ఏలో ఇండియా, యూఎస్‌ఏ, మోరాకో, బ్రెజిల్‌, గ్రూప్‌-బీలో జర్మనీ, నైజీరియా, చీలె, న్యూజిలాండ్‌, గ్రూప్‌-సీలో స్పెయిన్‌, కొలంబియా, మెక్సికో, చైనా, గ్రూప్‌-డీలో జపాన్‌, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్‌ జట్లు ఉన్నాయి. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, మార్గావ్‌ (గోవా)లోని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం, నవీ ముంబైలోని డా. డీవై పాటిల్‌ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement