Thursday, April 18, 2024

కొవిడ్‌ భయాలు.. చైనాలో వృద్ధుల ఆత్మహత్యలు

చైనాలో కొవిడ్‌ రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మహమ్మారికి బలవ్వాల్సి వస్తుందేమోనని భీతిల్లుతున్నారు. పట్టణాల నుంచి గ్రామాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో, గ్రామీణ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్లీనిక్కుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది.

గ్రామీణ చైనాలో ఇలాంటి ఘోర పరిస్థితిని ఇంతకు ముందెన్నడూ చూడలేదని వైద్యులు విస్మమయం వ్యక్తంచేస్తున్నారు. సాధారంగా ఆసుపత్రులకు రోజూ వంద మంది దాకా రోగులు వస్తుంటారు. అయితే, ప్రస్తుతం తరుణంలో ఐదు వందలకు పైబడి రోగుల వస్తుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్థానిక డాక్టర్లు అంటున్నారు. దీంతో మందుల కొరత ఏర్పడింది. మందుల కొరత కారణంగా అనేక క్లీనిక్‌లు మూసివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం గ్రామీణ చైనాలో నెలకొంది.

సాధారణ మందుల కొరతతో ప్రజలు పశువుల వైద్యానికి వాడే మందులను మింగేస్తున్నారు. ఫలితంగా అనేక మంది సైడ్‌ ఎఫెక్ట్‌లకు గురవుతున్నారు. కొవిడ్‌ భయంతో అనేక మంది వృద్ధులు పురుగుల మందులు తాగి, ఆత్మహత్యలకు పాల్పడుతుండటం గ్రామీణ చైనాలో నెలకొన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement