Tuesday, September 26, 2023

పెద్ద‌ల‌కు తెలిసింద‌న్న భ‌యంతో.. ప్రేమజంట ఆత్మహత్య..

పెద్దకొత్తపల్లి, (ప్రభ న్యూస్): ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఈరోజు (శనివారం) జ‌రిగింది. ఆ గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెంట్ల‌వెల్లి మండ‌లం వ‌ల్ల‌భాపూర్ గ్రామానికి చెందిన అశ్వ‌క్ పెద్ద‌కొత్త‌ప‌ల్లిలో లేడీస్ కార్న‌ర్ న‌డుపుతున్నాడు. త‌ను అద్దెకు ఉన్న ఇంటి ఓన‌ర్ కూతురు కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు.

వాళ్ల‌ ల‌వ్ మ్యాట‌ర్ అమ్మాయి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌డంతో భ‌య‌ప‌డ్డ అశ్వ‌క్ పురుగుల మందు తాగాడు. అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన అత‌డిని నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లో చ‌నిపోయాడు. ఈ విష‌యం తెలిసిన అమ్మాయి కూడా పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను 108 అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆ యువ‌తి కూడా చ‌నిపోయింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెల‌కొంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement