Monday, May 29, 2023

బోర్డర్‏లో భయం భయం..!

  • నిద్రావస్థలో ‘నిఘా’ నేత్రం
  • పెరిగిపోతున్న చోరీలు
  • ఎనిమిది దాటితే దొంగల భయం
  • నిఘా నేత్రాలు… నేల చూపులు
  • ఇదే అదనుగా చెలరేగిపోతున్న అంతరాష్ట్ర దొంగలు

మానవపాడు, ప్రభ న్యూస్ : ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తాలో ఎనిమిది దాటితే, ఇటు మందు బాబులు, అటు దొంగలు స్వేచ్ఛ విహరం చేస్తున్నారు. రాత్రి అయితే స్థానికులు బయటకు రావాలంటే హడలిపోతున్నారు. నేరం జరిగినపుడు పోలీసులు నిందుతులను గుర్తించడానికి నిఘా నేత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఎన్నో కేసుల్లో కీలకంగా మారుతున్నాయి. త్వరితగతిన కేసులను ఛేదించడానికి దోహదపడుతాయి. అంతటి కీలకమైన కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. వాటికి మరమ్మతులు చేయించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. నాలుగు కూడలి కలిగిన మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అలంపూర్ చౌరస్తాలో ఎవరెవరూ వచ్చి వెళ్తున్నారు. ఎంజరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. (నేను సైతం) కార్యక్రమం ద్వారా పోలీసులు కెమెరాలు ఏర్పాటుకు చొరవ చూపారు. విస్తృత సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించి ఫలితం సాధించారు.కాని నేడు వాటిని పట్టించుకోని నాధుడే కరువయ్యారు.

మసకబారిన ‘నిఘానేత్రాలు’!
దొంగతనాల నివారణ కోసం పోలీసు అధికారులు సర్వశక్తులొడ్డి ఏర్పాటు చేసిన సిసి కెమెరాల వ్యవహారం మున్నాళ్ల ముచ్చటగా మారింది. స్థానికంగా ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలలో దాదాపు 80 శాతం కెమెరాలు పనిచేయడం లేదు. టోల్ ప్లాజా నుండి జల్లాపురం వరకు ఉన్న సిసీ కెమెరా లో కేవలం ఐదారు కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. పనిచేయని కెమెరాలను ఎవరు మరమ్మతులు చేయాలన్నది అంతుచిక్కడం లేదు. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు ఎవరు భరించాలని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గతంలో ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో ఇక్కడి పోలీసుబాసులు అఘమేఘాల మీద వీటిని ఏర్పాటు చేసినప్పటికీ ఉన్నతాధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు.

- Advertisement -
   

అలంపూర్ చౌరస్తాలో వరుస దొంగతనాలు..
1) గతంలో అలంపూర్ చౌరస్తాలో డాక్టర్ ఇలియాస్ హస్పిటల్ లో తలుపులు రంద్రం చేసి రూ.10 వేల నగదు అపహరణ.
2) నూర్ సిమెంట్, స్టీల్ ట్రైడర్స్ లో షాపు రేకులను కత్తిరించి కొంత నగదు చోరీ అదేరోజు కూల్ డ్రింక్స్ షాపు, వీరభద్ర షాపుల తలుపులను ద్వంసం చేశారు.
3) రాయచూరు రోడ్డులో ఉన్న దయాకర్ ట్రైడర్స్ రూ.83 వేలు వరసగా మూడు స్వెటర్లకు తాళ్లాలను పగులగొట్టారు.
4) రాయచూరు రోడ్డు ప్రక్కన ఉన్న ఎస్ కే హెచ్ ట్రేడర్స్ లో డివిఆర్ తో పాటు రూ.50 వేలు నగదు అపహరణ.
5) బాట సారులను భయ‌భ్రాంతులకు గురిచేసిన సంఘటనలు ఎన్నో.
ఈ సంఘటనలని జరిగి రెండు సంవత్సరాలలోపే ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించి పెట్రోలింగ్ పెంచి సిసీ కెమెరాలు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

అలంపూర్ చౌరస్తాలో పెట్రోలింగ్ పెంచాలి : దయాకర్ రెడ్డి పుల్లూరు గ్రామం
అలంపూర్ చౌరస్తాలో రాయచూరు రోడ్డులో దయాకర్ ట్రైడర్స్ పర్టిలేజర్ షాపు ఉంది. గతం 2021 అక్టోబర్ 14వ తేదీ రాత్రి షాపు తలుపులు పగులగొట్టి రూ.83 వేలు దొంగలించారు. ఇంత వరకు నగదు సంభందించిన సమాచారం ఇవ్వలేదు. అలంపూర్ చౌరస్తాలో రాత్రి అయితే భయం తో ఉండాల్సిన పరిస్థితి, మాషాపులకు వచ్చిన ఒక వాచిమెన్ పెట్టి కాపాడుకుంటున్నాం. జిల్లా అధికారులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను అరికట్టాలి.

అలంపూర్ చౌరస్తాలో ఉండాలంటే భయంగాఉంది : ఎస్.కే.హెచ్ తన్వీర్
రాయచూరు రోడ్డు లో ఎస్.కె.హెచ్ ట్రేడర్స్ పేరు గల గోదాం మాకు ఉంది. ఈ మధ్య‌ కాలంలోనే అర్దరాత్రి సమయంలో గోదాం తలుపులను పగులగొట్టి గదిలో ఉన్న డివిఆర్ 50వేలనగదు ఎత్తుకెళ్లారు. ఇక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉంది. అలంపూర్ చౌరస్తాలో సిసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement