Saturday, April 20, 2024

ఎఫ్‌సీఐ గోదాములకు తగిన నిల్వ సామర్థ్యం ఉంది.. ఎంపీ నామ ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజావసరాల కోసం సేకరించే బియ్యం, గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్‌సీఐ తగిన నిల్వ సామర్ధ్యాన్ని కలిగి ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఎఫ్‌సీఐ పౌరసరఫరాల అవసరాల కోసం బఫర్ స్టోర్ నిర్వహణకు దేశంలో ఎన్ని గోదాములు అందుబాటులో ఉన్నాయి? వాటికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని తెలపాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించారు. ఇప్పటివరకు 718.75 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీకిగాను 376.43 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలు గోదాముల్లో ఉన్నాయని గ్రామీణాభివృద్ధి, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నామా ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

వివిధ ఏజెన్సీల ద్వారా బియ్యం, గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. సౌత్ జోన్‌లోని తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐ 13.60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యాన్ని కలిగి ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఎఫ్‌సీఐకి 6.68 లక్షల మెట్రిక్ టన్నులు, అద్దెకు సంబంధించి 6.92 లక్షల మెట్రిక్ టన్నుల మేర నిల్వ చేసుకునే సామర్థ్యం గల గోదాములు తెలంగాణ ఎఫ్‌సీఐకి ఉందని సాధ్వి నిరంజన్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement