Thursday, March 28, 2024

అనుకూల వాతావ‌ర‌ణం.. అమర్‌నాథ్‌ యాత్ర పునః ప్రారంభం

జమ్మూ, కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తిరిగి పున: ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత ఐటీబీపీ, ఆర్మీ, వైమానిక సిబ్బంది యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గుహవద్ద మట్టి, రాళ్లను భధ్రతా సిబ్బంది తొలగించారు. ప్రస్తుతం కొంత పరిస్థితులు మెరుగుపడటంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. టోకెన్లు జారీ చేసి భక్తులను దర్శనానికి పంపుతున్నారు.

అమర్‌నాథ్‌కు గుహకు పంత్‌ తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్‌ మార్గంలోనే వెనక్కి రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 7 వేలకు పైగా యాత్రికులు చండీన్వాడీ మార్గాన్ని దాటారు. వర్షాలకు ముందు 1.13 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ గుహలో మంచులింగాన్ని దర్శించుకున్నారు. ” మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది. బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాం. సీఆర్‌పిఎఫ్‌ ఇతర సిబ్బంది మార్గనిర్దేశనం చేశారు. క్షేమంగా ముందుకు సాగుతున్నాం” అని అమరనాథ్‌ యాత్రికులు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement