Wednesday, March 27, 2024

మూడేళ్ల చిన్నారిని తాడుతో కొట్టిన కన్న తండ్రి..

మాట వినడం లేదంటూ మూడెళ్ల చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించాడో తండ్రి. ఓ మూడు సంవత్సరాల చిన్నారి పట్ల.. సొంత తండ్రి దారుణంగా వ్యవహరించాడు. తాడుతో దారుణంగా కొట్టాడు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. మేడిశెట్టి నాగరాజు కు 3 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ చిన్నారి ఉంది. అయితే.. అన్నం తినడం లేదని… ఆ చిన్నారిని దారుణంగా కొట్టాడు ఆ తండ్రి. తాడుతో చిన్నారి మోఖం, వీపు భాగాల్లో… గొడ్డును బాదినట్టు బాదాడు. అలాగే… ఆ చిన్నారి మెడ పట్టుకుని… పైకి లేపి మరీ కొట్టాడు ఆ కిరాతకుడు. చిన్నారి ని కొడుతుంటే ఆ పినతల్లి కూడా నవ్వుతూ ఎంజాయ్‌ చేయడం కొసమెరుపు. అయితే.. ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి… ఎవరికీ తెలియకుండా ఈ వీడియో ను తీశాడు. తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో బయటపడింది. పోలీసులు ఇంతక ముందు కూడా విరికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికి వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. పసిపాప పట్ల ఇంత కృరంగా ప్రవర్తించిన వీరిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

https://twitter.com/revathitweets/status/1440168650170789891

ఇది కూడా చదవండి: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది: గంభీర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement