Sunday, December 4, 2022

Breaking: ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. చ‌మేలి లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు, 12 మంది మృతి

ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చ‌మేలో ద‌గ్గ‌రున్న ఓ లోయ‌లో బ‌స్సు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది చ‌నిపోయిన‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం అందుతోంది. ఇంకా చాలామందికి తీవ్ర గాయాల‌య్యి. లోయ‌లోని 700 మీట‌ర్ల లోతున్న ఓ లోయ‌లోకి బ‌స్సు దూసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ సమీపంలో ఇవ్వాల (శుక్ర‌వారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు దాదాపు 12మంది వ‌ర‌కు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. జోషిమత్ బ్లాక్‌లోని ఉర్గాం-పల్లా జఖోలా సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. మొత్తం మృతుల్లో 10 మంది పురుషులున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, పోలీసు సూపరింటెండెంట్ ప్రమంద్ర దోవల్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), స్థానిక యంత్రాంగం ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement