Saturday, November 26, 2022

ఉత్త‌రప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి…

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెంద‌గా.. మరో ఏడుగురు గాయపడ్డారు. కారు బోల్తా ప‌డ‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో 12 మంది ఉన్నారు. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. అనంత‌రం క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. లఖింపూర్‌ ఖేరిలోని పాలియా తహసీల్‌ ప్రాంతంలోని భీరామార్గ్‌లో రోడ్డు పక్కనే ఉన్న గుంత వద్ద ఎస్‌యూవీ బోల్తాపడింది. పలియా వద్ద రోడ్డు కోతకు గురైందని, ఈ సమయంలో డ్రైవర్‌ నిద్రపోయాడా?.. అతని పరిస్థితి ఎలా ఉందో? ప్రమాదంలో బయటపడ్డ ఓ వ్యక్తి పేర్కొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement