Friday, March 29, 2024

చైనాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

చైనాలో జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 17 మంది మృతి చెంద‌గా.. 22 మంది గాయాల‌పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. జియాంగ్జీ ప్రావిన్స్‌లోని నాన్‌చాంగ్‌ కౌంటీలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు వాహనాలు ఢీక‌న‌గా.. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కాగా, ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగానే ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement