Tuesday, January 25, 2022

టీఆర్ ఎస్ పాలనలో.. రైతులే రారాజులు: విప్ గొంగిడి సునితారెడ్డి

ప్రభన్యూస్, యాదాద్రి : తెరాస ప్రభుత్వ పాలనలో రైతులు రారాజులేనని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో లో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. దేశ చరిత్రలో నిలచిపోయే రైతుబంధు రైతు బీమా పథకాలు ఎంతో ఆదరణ పొందాయని, అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. 8 విడతలుగా ఎకరాకు ఐదు వేల పెట్టుబడి సాయం అందజేసి నేటికీ 50 వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో అందజేశారన్నారు.

వారం రోజులుగా రైతులు గ్రామాలలో గ్రామాలలో రైతుబంధు వారోత్సవాలను ఎంతో ఆర్భాటంగా, పండగ వాతావరణంలో జరుపుకున్నారని చెప్పారు. రైతులు వ్యవసాయంపై చర్చించుకుని వేదిక రైతు వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో లో సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, ఎం పి పి గోపగాని బాలమని, జెడ్ పి టి సి చామకూర గోపాల్ గౌడ్, నాయకులు నాగిర్తి రాజిరెడ్డి, ఎడ్ల బాలలక్ష్మి, గొల్లపల్లి రాంరెడ్డి, సంధిల భాస్కర్ గౌడ్ పల్లె సంతోష్ గౌడ్, కటకం స్వామి, మహేందర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News