Thursday, March 30, 2023

విద్యుత్ ఘాతంతో రైతు మృతి..

చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గోల్కొండ రమేష్ (50) తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలి ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు రమేష్ గ్రామ శివారు చలివాగు సమీపంలో గల పొలానికి నీరు పెట్టేందుకు స్టార్టర్ లో స్విచ్ వేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. రైతు మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య ముగ్గురు కుమారులున్నారు. విద్యుత్ ఘాతంతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement