Thursday, April 25, 2024

ఆస్కార్ లో ఎన్టీఆర్ పేరు-సంబ‌రాలు చేసుకుంటోన్న ఫ్యాన్స్

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించి చిత్రం ఆర్ ఆర్ ఆర్.ఈ చిత్రం ప‌లు రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌..మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. కాగా ఎన్టీఆర్ పేరు ఆస్కార్ లిస్ట్‌లో చేరింది. అమెరికాకు చెందిన‌ ప్ర‌ముఖ మూవీ పబ్లికేష‌న్స్ ‘VARIETY’ వారు ఆస్కార్‌-2023కి ఉత్త‌మ న‌టుడు కేట‌గిరీలో పోటీగా ఉన్న న‌టుల పేర్ల‌ను ప్ర‌చురించింది. ఈ లిస్ట్‌లో తార‌క్ పేరు కూడా ఉంది. ఆసియా నుండి ఈ లిస్ట్‌లో ఉన్న ఎకైక న‌టుడు ఎన్టీఆర్ కావ‌డం విశేషం. ఈ విష‌యం తెలిసిన తార‌క్ అభిమానులు సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లై సంచ‌ల‌నం విజ‌యం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement