Friday, April 26, 2024

‘పుష్ప’ నుంచి బిగ్ అప్‌డేట్.. భయపెడుతున్న విలన్ లుక్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆర్య‌,ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత సుకుమార్-బ‌న్నీ కాంబినేష‌న్‌లోఈ చిత్రం రూపొందుతుంది. పుష్ప చిత్రంలో మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న క‌న్నుకు సంబంధించిన పోస్ట‌ర్ మాత్ర‌మే విడుద‌ల చేసిన మేకర్స్ ఇప్పుడు ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల చేశారు. ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది.

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా.. కంటిచూపుతోనే అందర్నీ గజగజ వణికించేలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను మూత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా, ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement