Thursday, March 28, 2024

ట్రంప్ కి ఫేస్‌బుక్‌ షాక్.. ఖాతాపై రెండేళ్ల నిషేధం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్‌ షాక్ ఇచ్చింది. ట్రంప్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను రెండేళ్లపాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి 7న అమలులోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 6న ఫేస్​బుక్​ ద్వారా ట్రంప్​ చేసిన పోస్టులు సంస్థ నియమాలను ఉల్లంఘించాయని, కంపెనీ గ్లోబల్ వ్యవహారాల ఉపాధ్యక్షుడు నిక్‌ క్లెగ్ పేర్కొన్నారు. దీంతో రెండేళ్ల పాటు ట్రంప్‌ ఖాతాను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిర్ణయంపై మరోసారి సమీక్ష జరుపుతామని పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించగలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలని ఫేస్‌బుక్‌ పేర్కొంది.

అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడిన మూకలను గొప్ప దేశ భక్తులుగా పేర్కొంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం, అలాగే, ఆ నిరసనకారులను ప్రేమిస్తున్నానంటూ వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశం కాగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు రణరంగం సృష్టించారు. క్యాపిటల్‌ భవనంపై దాడులు చేసిన మూకలను గొప్ప దేశభక్తులుగా పేర్కొనడంతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పలు సోషల్ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement