Friday, February 3, 2023

సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టినదే ‘కంటి వెలుగు’ : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : కంటి వెలుగు తరహ పథకం తెలంగాణలో మినహా ప్రపంచంలో ఎక్కడా లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ఆలోచనల నుంచి పుట్టినదే కంటి వెలుగు కార్యక్రమమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆవరణలో సూర్యాపేట మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వెలుగు అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కంటిచూపు సమస్యను నిర్లక్ష్యం వహిస్తున్న ప్రజలను చైతన్యం చేసి కంటి వెలుగులో పరీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలనిఅధికారులకు సూచించారు. రెండవ విడత కంటి వెలుగు కు జిల్లా వ్యాప్తంగా 600 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాధితులకు అక్కడికక్కడే కళ్ల జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే వారికి ఆపరేషన్లను సంబంధిత ఆసుపత్రి లలో చేయిస్తామని తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement