Friday, October 4, 2024

TG | మెడికల్‌ సీట్ల వెబ్‌ ఆప్షన్లకు గడువు పెంపు !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబరు 2వ తేదీ మధ్యాహ్నం వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది.

అర్హులైన విద్యారుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులైన అభ్యర్ధులకు సంబంధించిన తుది మెరిట్‌ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటు-లో ఉంచింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30 నుంచి ప్రైవేటు వైద్య కళాశాలలతో పాటు నీలిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో అడ్మిషన్ల కోసం వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చని హెల్త్‌ వర్సిటీ సూచించింది.

ఇక మేనేజ్‌మెంట్‌ సీట్లకు గతేడాది నిర్దేశించిన ఫీజులే అమలవుతాయని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్మీ డెంటల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద అడ్మిషన్లకు సంబంధించి అక్టోబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement