Saturday, April 20, 2024

Big Story | కాకతీయ కాలువ విస్తరణ.. పూర్తి కావస్తున్న రోళ్ల వాగు పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమీపంలో వర్షాకాలం ఉండటంతో పంటకాలువల మరమ్మత్తులపై సాగునీటి శాఖ దృష్టి సారించింది. ఎక్కడికక్కడ సర్వేలునిర్వహించి పంటకాలువల పునరుద్ధరణ పనుల్లో ప్రభుత్వం వేగం పంచింది. ప్రాజెక్టుల వారిగా ఈఎన్సీలకు బాధ్యతలు అప్పగించి కాలువల లీకేజీలు, పునరుద్ధరణ, పూడిక తీతల్లో నీటిపారుదల శాఖ నిమగ్నమైంది. రాష్ట్రంలో 866 కిలోమీటర్ల ప్రధానకాలువలు, 13వేల 373 కిలోమీటర్ల ఉపకాలువలు, వేలాదిచెరువులు, జలాశయాలనుంచి పంటకాలువలు, 8021చెక్‌ డ్యాలు, కాలువలపై లక్షా 26వేల 477 స్ట్ర క్చర్లతో ఉన్న నిర్మాణాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో రానున్న వర్షకాలానికి కాలువల లీకేజీలు, పూడికల పనులు పూర్తి చేసేందుకు పనులు జరుగుతున్నాయి.

నూతనంగా నిర్మాణాలు చేపట్టిన ప్రధాన పంటకాలువల నిర్మాణాలను కూడా పూర్తిచేయానే లక్ష్యంతో ప్రభుత్వంపనుల్లో వేగం పెంచింది. ప్రాజెక్టుల నిర్మాణాల అనంతరం నీటిని సరఫరాచేసే కాలువల నిర్వహణ పై గత సమైక్యపాలకులు దృష్టి సారించకపోవడంతో కాలువలపై నిర్మించిన కొన్ని స్ట్రక్చర్లు పూర్తిగా దెబ్బతినడం,తూములగేట్లు పాడై పోవడంతో ఉత్పన్నమైన సమస్యలను తెలంగాణప్రభుత్వం పరిష్కరించి ఎక్కడికక్కడ నిర్మాణ పనులు చేపట్టడంతో పంటకాలువలకు నీటిప్రవాహం అందుతుంది. ప్రధానంగా శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, వనదుర్గ, రాజోెలిబండ ,సదర్మాట్‌, మూసి,సాత్నాల, చెలిమెలవాగు, స్వర్ణ, నల్లవాగు,శనిగరం ప్రాజెక్టుల కాలువల ఆధునీకరణతో పంటకాలువల్లో అంతరాయం లేకండా నీటి ప్రవాహం పరుగులు తీస్తుంది ఆయకట్టు విస్తీర్ణం పెగిగింది.

- Advertisement -

పాలేరు పాతకాలువ, బేతుపల్లి వరదకాలువ ఆధునీకరణ పనులను పూర్తిచేసిన ప్రభుత్వం ప్రస్తుతం కాకతీయ కాలువ విస్తరణ పనుల్లో నిమగ్నమైంది. వర్షాకాలం సమీపిస్తుండటంతో కాకతీయ కాలువ పునరుద్ధరణ,సామర్థ్యంపెంపుపనుల్లో నీటి పారుదల శాఖ నిమగ్నమైంది.9వేల 700 క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యంతో 284 కిలో మీటర్ల పొడవులో విస్తరించిన కాకతీయ కాలువ ఉత్తరతెలంగాణలోని ఐదు జిల్లాల్లో విస్తరించి కాకతీయ కాలువకు అనుసంధానంగా అనేక పంటకాలువల నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లా బీర్‌ పూర్‌ మండలంలో కాకతీయ ప్రధాన కాలువ విస్తరణ పులు కొనసాగుతున్నాయి.

రోల్లవాగు సామర్థ్యాన్ని పెంచుతూ కాకతీయ కాలువ విస్తరణను పెంచేందుకు ఈ ప్రాజెక్టు పనులను రూ.6కోట్ల 23లక్షల 50వేల తో పనులను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం అంచనావ్యయం రూ.12కోట్లకు చేరుకుంది. కాలువకు సంబంధించిన 3తూములు, మూడుగట్లలో రెండవగట్టు పూర్తి కావల్సి ఉంది. ఒకటి, రెండు గట్లు పూర్తి అవడంతో ప్రతిపాదిత 15వేల ఆయకట్టుకు ప్రస్తుతం వర్షకాలంలో నీరందనుంది.మిగతా పనులు సంవతస్రాంతానికి పూర్తి చేసి మరో15వేల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement