Monday, November 11, 2024

Exit Polls – హరియాణా పీఠం కాంగ్రెస్ దే

హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను వెలువరించాయి..

90 ఆసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజార్టీ సర్వే సంస్థలు కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి.

.అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హరియణా పీఠాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ , కాంగ్రెస్‌ తమ శక్తికి మించి కృషి చేశాయి. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేశాయి.

. శనివారం పోలింగ్‌ దశ ముగియడంతో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను ప్రకటించాయి.

- Advertisement -

పీపుల్స్‌ పల్స్‌ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ 26, ఐఎన్‌ఎల్‌డీ 2-3, జేజేపీ 0-1, ఇతరులు 3-5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

రిపబ్లిక్‌ మ్యాట్రిజ్: కాంగ్రెస్‌: 55-62, బీజేపీ 18-24, ఐఎన్‌ఎల్‌డీ+బీఎస్పీ: 3-6, జేజేపీ: 0-3, ఇతరులు: 2-5

ధ్రువ్‌ రీసెర్చ్‌: కాంగ్రెస్‌: 57-64, బీజేపీ: 27-32, ఇతరులు: 5-8

దైనిక్‌ భాస్కర్‌: కాంగ్రెస్‌: 44-54, బీజేపీ: 19-29, జేజేపీ: 0-1, ఐఎన్‌ఎల్‌డీ 1-5, ఇతరులు 4-9

పి-మార్క్‌: కాంగ్రెస్‌+: 44-54, బీజేపీ: 15-29, జేజేపీ:0, ఐఎన్‌ఎల్‌డీ+: 3-6, ఇతరులు:0

ఇండియాటుడే- సి ఓటర్‌: కాంగ్రెస్‌: 50-58, బీజేపీ: 20-28, జేజేపీ: 0-2, ఇతరులు: 10-14

Advertisement

తాజా వార్తలు

Advertisement