Friday, April 19, 2024

Exams Schedule : ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. 2023 ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. సీబీఎస్‌ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. ఏప్రిల్‌ 3న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్‌ 6న సెకండ్‌ లాంగ్వేజ్‌, 8న ఇంగ్లిష్‌, ఏప్రిల్‌ 10న గణితం, 13న సామాన్య శాస్త్రం, 15న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 17న కాంపోజిట్స్‌ కోర్సు పరీక్ష, 18న వొకేషనల్‌ కోర్సు పరీక్ష ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement