Tuesday, December 3, 2024

TG | మల్టి పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు డిసెంబరు 29న పరీక్ష

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. డిసెంబరు 29న ఈ పోస్టులకు భర్తీకి పరీక్షను నిర్వహించనుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. నియామక పరీక్షలను కంప్యుటర్‌ బేస్ట్‌ -టె-స్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement