Thursday, April 25, 2024

బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలి.. 21న జిల్లా విస్తృత స్థాయి సమావేశం

భారత రాష్ట్ర సమితి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీలో పనిచేసే కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏప్రిల్ 2 వ తేది నుండి 13వ తేది వరకు జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ లోని కెసిఆర్ రెస్ట్ హౌస్ లో స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చేపట్టనున్న పార్టీ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకీ కార్యకర్తలే బలం అని, కింది స్థాయిలో పని చేసే కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఇందులో భాగంగా మార్చ్ 21 వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య సమావేశం నిర్వహించాలని, అలాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి 13వ తేది వరకు అన్ని నియోజకవర్గాల్లో పదిరోజుల పాటు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ పది గ్రామాలను యూనిట్ గా తీసుకొని ఎమ్మేల్యేలు పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని, పట్టణాల్లో డివిజన్ల వారీగా సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పని చేస్తున్న ప్రతీ ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనీ అన్నారు.

కార్య‌క్ర‌మానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు అధ్యక్షత వ‌హించ‌గా.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, శాసన మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, మానకొండుర్, చొప్పదండి ఎమ్మేల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవి శంకర్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, నగర మేయర్ సునీల్ రావులు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement