Friday, March 29, 2024

క్ష‌మాప‌ణ‌లు చెప్పినా.. అనంత శ్రీరామ్ కి త‌ప్ప‌ని తిప్ప‌లు

ఇటీవ‌ల సంక్రాంతి సంబ‌రాల‌లో భ‌ట్రాజు ప‌ద ప్ర‌యోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు టాలీవుడ్ గీత ర‌చ‌యిత అనంత శ్రీరామ్. ఏపీ ప్రభుత్వం భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధిత జాబితాలో ఉంచింది. ఈ విష‌యంపై బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ, అనంతశ్రీరామ్ పై భట్రాజు కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ పై భట్రాజు కుల సంఘాల ప్రతినిధులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అనంత శ్రీరామ్ పాలకొల్లులో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో భట్రాజు పొగడ్తలు అని పలికారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పదాన్ని వాడి తమ వర్గీయులను అనంత శ్రీరామ్ కించపరిచాడంటూ భట్రాజు కులసంఘాలు మండిపడుతున్నాయి. అనంత శ్రీరామ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement