Thursday, September 16, 2021

టీఆర్పీల్లో దూసుకుపోతున్న మీలో ఎవరు కోటీశ్వరులు

బిగ్ బాస్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే సినిమా చేస్తున్నారు.సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ప్ర‌ముఖ‌ టీవీలో ప్రసారమవుతోంది. తొలి రోజు రామ్ చ‌ర‌ణ్ ఈ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. ఆ షోకి మంచి ఆద‌ర‌ణ లభించింది.

గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేసినపుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్‌ను చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ మొద‌లైంది. ప్రిమియ‌ర్ ఎపిసోడ్ 11.40 సాధించింది. ఇక తొలి వారం 5.62 టీ ఆర్పీ రాగా, రెండో వారం యావరేజ్ గా 6.48 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింద‌ట‌. ఇది ఈ సీజన్‌లోనే కాకుండా ఇప్పటి వరకు సీజన్స్ లోనే అత్యధికం అని తెలుస్తుంది. రానున్న రోజుల‌లో ఈ షో మ‌రింత టీఆర్పీ తెచ్చుకుంటుంద‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News