Wednesday, April 24, 2024

వోల్వో నుంచి వ‌స్తున్న ఈవీ .. వోల్వో సీ-40 రిలీజ్‌కు రెడీ!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో.. తన వోల్వో సి-40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును భారత్‌లో విడుదల చేయనుంది. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో బైక్, కార్ వాహనాల తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలోకి అడుగుపెట్టారు. ఆ విషయంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన వోల్వో C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును దేశంలో విడుదల చేయనుంది.

- Advertisement -

వోల్వో C40 డిజైన్..

ఈ వోల్వో సి40 ఎలక్ట్రిక్ కారును ఆధునిక ఫీచర్లతో సొగసైన విధంగా డిజైన్ చేశారు. ఆటోమేకర్ సిగ్నేచర్ స్టైలింగ్‌ను ఫీచర్ చేస్తుంది. సాధారణంగా కార్లలో ఉపయోగించే రేడియేటర్ గ్రిల్‌కు బదులుగా ముందు భాగం క్లోజ్డ్ ప్యానెల్‌తో ఉంటుంది. అలాగే, కారు ఒక మోటారుతో వెనుక చక్రాల డ్రైవ్ కాన్ఫిగరేషన్, రెండు మోటార్లతో ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.

వోల్వో C40 బ్యాటరీ..

వోల్వో C40 ఎలక్ట్రిక్ కారు 78 kWh బ్యాటరీ నుండి ప‌వ‌ర్‌ని క‌లిగి ఉంటుంది. ఇది 150kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీంతో 40 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 371 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇందులో ఎంతో హాయిగా, అయిదుగురు వ్యక్తులు కూర్చుని జ‌ర్నీ చేసే అవ‌కాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement