Thursday, March 28, 2024

కలికాలం అంటే ఇదే.. యువకుడి పురుషాంగం కోసేశారు

యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఆగ్రాలో రెండు రోజుల క్రితం ఓ యువకుడి పురుషాంగాన్ని ఇద్దరు నపుంసకులు కోసేసి పారిపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్రా ప‌ట్ట‌ణానికి చెందిన 24 ఏళ్ల యువ‌కుడు త‌ర‌చూ గుడీ, రాజీ అనే ఇద్ద‌రు నపుంస‌కుల‌తో క‌లిసి తిరిగేవాడు. వాళ్ల‌తో క‌లిసి పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల సంద‌ర్భంగా డ్యాన్సులు చేసేందుకు వెళ్తుండేవాడు.

గ‌త బుధ‌వారం (ఈనెల 7వ తేదీ) రాత్రి కూడా స‌ద‌రు యువ‌కుడు గుడీ, రాజీల‌తో క‌లిసి ఓ పెళ్లి ఊరేగింపులో డ్యాన్సు చేసేందుకు వెళ్లాడు. డ‌బ్బుల విష‌యంలో నపుంస‌కుల‌కు, యువ‌కుడికి మ‌ధ్య గొడ‌వ జ‌రుగ‌డంతో ఇద్ద‌రు క‌లిసి యువ‌కుడి మ‌ర్మాంగాన్ని కోసేసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భ‌య‌ప‌డిపోయిన బాధితుడు త‌న సోద‌రికి ఫోన్ చేసి జ‌రిగిన విష‌యం చెప్పాడు. వెంటనే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న యువ‌కుడి సోద‌రి అత‌డిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స అనంత‌రం సోద‌రుడిని వెంట‌ తీసుకెళ్లి ఢిల్లీ గేట్ పోలీస్‌స్టేష‌న్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేప‌ట్టారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement