Saturday, March 23, 2024

దుబ్బాకలో జరిగిందే హుజురాబాద్ లో జరుగుతుంది: ఈటల రాజేంధర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ పర్యటన రసవత్తరంగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. అధికారులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు. తన పాదయాత్రకు అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము మధ్యాహ్న భోజనం కోసం ఓ రైస్ మిల్లులో ఏర్పాట్లు చేసుకుంటుంటే రైస్ మిల్ యజమానులను భయపెట్టి తమ వంట సరుకులను సీజ్ చేశారని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

ఇక దళిత బందు పథకం పెట్టడం సంతోషమే అని వ్యాఖ్యానించిన ఈటల…దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల ఏక్కడా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు. ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ ను ప్రజల మధ్యకు తీసుకువచ్చినది మనమే అని తెలిపారు. ఇక తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. అరె కొడకల్లారా! నన్ను నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. ఈటల మల్లయ్య కొడుకును, సమ్మన్న తమ్ముణ్ణి ఆనాడే కొట్లడిన వాళ్ళం.. ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతామన్నారు. తన కార్యకర్తలకు అన్నం పెట్టుకోడానికి తెచ్చుకున్న సామానులకు కూడా తాళం వేశారు. భోజన విరామం కోసం బుక్ చేసుకున్న రైస్ మిల్లును సీజ్ చేశారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నీచమైన సంస్కృతికి ఇలాంటి ఘటనలు నిదర్శనాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ముట్ట‌డించిన లంబాడీ హ‌క్కుల స‌మితి

Advertisement

తాజా వార్తలు

Advertisement