Monday, May 17, 2021

ప్రజలు అసహ్యించుకునేలా ప్రచారం చేస్తున్నారు…ఈటెల

ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి కేసీఆర్ ఆదేశాల మేరకు బర్త్ రఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మీడియా ముందుకు ఈటెల వచ్చారు. గత మూడు రోజులు గా పథకం ప్రకారం వేల ఎకరాల భూమి ఈటెల కబ్జా పెట్టారు. వేల కోట్ల డబ్బులు సంపాదించాడని ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈటెల. ప్రజలంతా కూడా అసహ్యించుకునేలా ప్రచారం చేశారని అన్నారు.

2002లో మెదక్ జిల్లాలో పార్టీ రాజకీయాలకు ఆకర్షితుడనై మధుసూదనాచారి ఆధ్వర్యంలో పార్టీ లో చేరాను. 19 సంవత్సరాలు పని చేశాను. 2004లో కమలపూర్ లో గెలిచిను. పార్టీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారని ఈటెల అన్నారు.
ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చారని
కేసీఆర్ కు పార్టీకి మచ్చ తెచ్చే పని నేను చేయలేదని పేర్కొన్నారు ఈటెల.

Advertisement

తాజా వార్తలు

Prabha News