Friday, March 29, 2024

జూన్‌ 5న బీసీ విద్యాసంస్థల్లో డిగ్రీ, ఇంటర్‌ కోర్సుల ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డిగ్రీ, ఇంటర్‌ కోర్సులలో చేరాలనుకునే బీసీ విద్యార్థులకు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల కాలేజీల్లో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష కోసం 51905 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఇంటర్‌ కోర్సుల కోసం 45735 మంది దరఖాస్తు చేసుకోగా, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశం కోసం 6170 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరందరికి వారి వారి జిల్లా కేంద్రాల్లో జూన్‌ 5న పరీక్ష నిర్వహిస్తామని మల్లయ్య బట్టు తెలిపారు.

ఇదిలావుండగా బీసీ సంక్షేమ గురుకుల్లో 6.7, 8వ తరగతిలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం జూన్‌ 2వ తేదీ లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మల్లయ్య బట్టు కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్‌ 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఎంజెపిటిబీసీడబ్ల్యూఈఐఎస్‌ డాట్‌ తెలంగాణ డాట్‌ జీవోవి డాన్‌ ఇన్‌ వెబ్‌సైట్‌ చూడాలని, అలాగే 040-23322377,23328266 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement