Thursday, November 7, 2024

T20 WC | ఇంగ్లండ్ బోణీ.. పోరాడి ఓడిన బంగ్లా..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ మహిళల జట్టు పోరాడి ఓడిపోయింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ తో తలపడిన బంగ్లా.. గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఇంగ్లండ్ జట్టు పుంజుకుని బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించడంతో 21 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన‌ ఇంగ్లండ్… బంగ్లాదేశ్ ముందు 119 ప‌రుగుల టార్గెట్ ని నిర్ధేశించింది. ఈ స్వ‌ల్ప చేధ‌న‌లో శోభ‌న మొస్ట్రే (44) అద్భుతంగా ఆడింది. మ‌రోవైపు కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా(15) ప‌రువాలేద‌నిపించింది. అయితే, ఇంగ్లండ్ స్పిన్న‌ర్లు లిన్సే స్మిత్(2/11), చార్లొట్టె డీన్(2/22)లు వ‌రుస వికెట్లు తీసి బంగ్లాను ఒత్తిడిలో ప‌డేశారు. దాంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 100 లోపే ప‌రిమిత‌మైన‌ బంగ్లా జ‌ట్టు…. 21 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement