Wednesday, April 24, 2024

వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌..

ఇంగ్లండ్ సూపర్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టోక్స్ తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా ఈ రోజు (సోమవారం) వన్డే క్రికెట్ ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్న‌ట్టు వెల్ల‌డించాడు. జూలై 19 (మంగళవారం) అంటే రేపు దక్షిణాఫ్రికా (ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా)తో జరిగే తొలి వన్డే.. ఈ ఫార్మాట్‌లో తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని స్టోక్స్ చెప్పాడు.

ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ రేప‌టి నుంచి ప్రారంభం కానుంది, ఇందులో మొదటి మ్యాచ్ డర్హామ్‌లో జరగనుంది. ఈ విధంగా స్టోక్స్ తన సొంత మైదానం నుంచి వన్డే క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలకనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement