Saturday, April 20, 2024

జూన్‌ 26 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌.. జులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. శనివారం నాడు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్‌.లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఈమేరకు ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జూన్‌ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 26 నుంచి జులై 19 వరకు కొనసాగనుంది. జూన్‌-26న ఆన్‌లైన్‌లో బేసిక్‌ ఇన్ఫర్మేషన్‌ నింపాలి.

- Advertisement -

ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 28 నుంచి జులై 7 వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జూన్‌ 28-జులై8 సర్టిఫికేషన్‌ పూర్తియిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్లను ఫ్రీజింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 12న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 12 నుంచి 19 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి.

అలాగే జులై 21 నుంచి రెండో విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. జులై 21 నుంచి 24 వరకు స్లాట్‌ బుక్‌ చేసుకోవడం, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరై, ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 28న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 28 నుంచి 31 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి కాలేజీల్లో ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 2 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది. ఆగస్టు 7న సీట్ల కేటాయింపు, 9 వరకు కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement