Thursday, April 25, 2024

గ్రీన్‌కి ఎనర్జీ ! గ్రీన్‌ టెక్నాలజీలో పెట్టుబడులకు రాయితీలు దక్కే అవకాశం

పునరుత్పాదక శక్తి వైపు ప్రపంచం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల నుంచి సోలార్‌ సెల్స్‌ వరకు వేగంగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. దీర్ఘకాలంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఊహించనంతగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరిత ఇంధనం వైపే అడుగులు పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ కూడా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు దృష్టిసారించింది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి పెద్ద ఎత్తున ఊతమిస్తోంది. పవన, సోలార్‌, జలవిద్యుత్‌ ప్రాజెక్టులను ప్రారంభించింది. హరిత టెక్నాలజీలవైపు మళ్లేందుకు కేంద్ర ప్రభుతం ఇవబోయే ప్రోత్సాహకాల కోసం కంపెనీలు ఆసక్తిగా బడ్జెట్‌ 2022-23 కోసం ఎదురుచూస్తున్నాయి.

పన్ను రాయితీలు ఇవ్వండి
పన్ను రాయితీల విషయానికి వస్తే.. గ్రీన్‌ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై పన్ను రేట్లను తగ్గించాలని ఫిక్కీ సూచించింది. గ్రీన్‌ టెక్నాలజీ అసెట్స్‌ కొనుగోలు లేదా పెట్టుబడులపై పూర్తి స్థాయి మినహాయింపులను కల్పించాలని కోరింది. నూతన, గ్రీన్‌ ఆప్షన్ల విషయంలో కొత్త టెక్నాలజీ సంస్థలను బడ్జెట్‌ ద్వారా ప్రోత్సాహించాలని కోరింది. మరోవైపు పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి రెసిడెన్సియల్‌ సెక్టార్‌ని ప్రోత్సాహించాలి. రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం పెంపునకు రెసిడెన్సియల్‌ రంగానికి క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని ఫిక్కీ సూచించింది. తద్వారా రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం ఇండస్ట్రీయల్‌, కమర్షియల్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ రంగాలకు ఆకర్షణీయంగా మారుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత్‌ను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా మార్చాలని కలలు కంటున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా అడుగులు వేయాలని భావిస్తున్న తరుణంలో బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయనున్నారో వేచిచూడాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement