Sunday, October 13, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి !

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో (సోమవారం) భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర అంతర్‌ రాష్ట్ర సరిహద్దులోని అబుజ్‌మద్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు గాలింపు చర్యలు చేస్తుండగా, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్ తో సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement