Thursday, March 28, 2024

ప్రయాణాలపై ఈఎంఐ సదుపాయం.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆఫర్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ వినియోగదారుల కోసం క్రెడిట్‌ కార్డులన్నింటిపై ఈ జనవరి 20 నుంచి ప్రత్యేక ప్రయాణ ఆఫర్లను ప్రకటించింది. ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కలిగిన వారు 2023లో ప్రయాణ బుకింగ్‌లపై 3 లేదా 6 నెలల నో కాస్ట్‌ ఈఎంఐలను పొందవచ్చు. క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ప్రముఖ ప్రయాణ భాగస్వాములైన యాత్ర, ఎంఎంటీ, క్లియర్‌ ట్రిప్‌, ఈఎంటీ మొదలైన వాటిపై ఆఫర్‌లతో ప్రయాణ బుకింగ్స్‌ చేసుకోవచ్చు.

ప్రయాణ ఖర్చులకు సులభతరం చేసేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారుల అవసరాలు బడ్జెట్‌ పొదుపు సెంటిమెంట్‌లను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల డిమాండ్‌లకు సరిపోయే ఆఫర్లను అందిస్తోంది. క్రెడిట్‌ కార్డు పెద్ద లావాదేవీలపై గరిష్ట రివార్డులను పొంది, తదుపరి బిల్లు సులభంగా చెల్లించడానికి స్మార్ట్‌ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందవచ్చని బ్యాంక్‌ తెలిపింది.

ప్రయాణం, డైనింగ్‌, అంతర్జాతీయ ఖర్చులపై రివార్డ్‌ పాయింట్లు పొందవచ్చు. బ్యాంక్‌ ప్రీమియం కార్డులు ఎటర్నా, వరుణ రెండింటీపైనా వంద స్వైపింగ్‌తో 15 రివార్డు పాయింట్లు పొందవచ్చు. బ్యాంక్‌ ఇతర కార్డులపై 10 రివార్డు పాయింట్లు పొందవచ్చు. వీటితో పాటు ఎయిర్‌పోర్టు లాంజ్‌ యాక్సెస్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌ల్లో 5 శాతం ఆదా చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ అనేది పూర్తిగా బ్యాంక్‌ యాజమాన్యంలో ఉన్న నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement