Friday, February 3, 2023

కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలుండే ఛాన్స్ : రాజగోపాల్ రెడ్డి

కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలుండే అవకాశం ఉందని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి గెలిచింద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు. తెలంగాణ‌లో బీజేపీ ఆదరణ పెరుగుతుంద‌ని, దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ లో భయం నెలకొందన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ లేద‌ని, అందులో ఉన్న సీనియ‌ర్లు బీజేపీలోకి రావాల‌ని పిలుపిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement