Monday, May 17, 2021

218వ సారి ఓడిన ఎలక్షన్‌ కింగ్‌ పద్మ రాజన్

ఎలక్షన్‌ కింగ్‌ పద్మ రాజన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయారుసీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎడప్పాడి నియోజకవర్గంలో, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా ధర్మధం నియోజకవర్గంలోనూ, తన సొంత నియోజకవర్గం మేట్టూరులో పోటీచేశారు. ఈసారి కూడా ఆయనకు ఎన్నికల్లో అపజయం ఎదురైందిసేలం జిల్లా మేట్టూరుకు చెందిన ఎలక్షన్‌ కింగ్‌ పద్మ రాజన్‌ ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి ఒక్క సారి కూడా విజయం సాధించలేకపోయారు. 1989 వ సంవత్సరం నుంచి దేశంలో జరిగే పలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు, రాష్ట్రపతి ఎన్నికల వరకు ఓటమి గురించి ఆలోచించకుండా పోటీచేసి లిమ్కా, గిన్నిస్‌ తదితర రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నారు. అందువల్ల ఆయనకు ఎన్నికల కింగ్ అని పేరు వచ్చింది. ఇప్పటివరకూ ఆయన 218 సార్లు నామినేషన్‌ వేసి ఓటమి పాలవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Prabha News