Friday, April 19, 2024

ఎడిటోరియ‌ల్ – గుడుల ర‌క్ష‌ణ‌కు అసీస్ హామీ..

ఆస్ట్రేలియాలో ఇటీవల హిందూ ఆలయాలపై దాడు లు తీవ్ర తరం కావడం పట్ల మన దేశం తీవ్ర నిరసననూ, ఆగ్రహాన్నీ తెలియజేసింది.మన దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బెనీస్‌కి రాష్ట్రపతి భవన్‌ లో స్వాగతం చెబుతూ, దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలను ఇలాంటి ఘటనలు దెబ్బ తీస్తున్నాయని మోడీ అన్నారు. మత సహనానికీ, మత పరమైన సామరస్యానికి అనాదిగా భారత్‌ పేరొందింద నీ, ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియాలో భారత్‌ వ్యతిరేక ధోరణులు పెరుగుతున్నాయనీ, ఇందుకు ఖలిస్తాన్‌ వాదులు కారణమన్న సమాచారం అందిందని ప్రధాని అన్నారు. అహ్మదాబాద్‌, ముంబాయి పర్యటనలను ముగించుకుని ఆల్బెనీస్‌ ఢిల్లి చేరుకున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ని అహ్మదాబాద్‌లో మోడీతో కలిసి ఆయన వీక్షించారు. ఇరుదేశాల జట్ల మధ్య జరిగిన నాల్గో టెస్ట్‌కి ఆల్బెనీస్‌, మోడీలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. క్రీడారంగంలో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య పెరుగుతున్న ఆత్మీయత, స్నేహ సంబంధాల పట్ల ఇరువురు ప్రధానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే రీతిలో ఆస్ట్రేలియాలో ఇటీవల భారత మందిరాలు, గుళ్ళు, గోపురాలపై పెరుగుతున్న దాడులను గురించి వారు సీరియస్‌గా చర్చించారు.

ఖలిస్తాన్‌ వాదులు గతంలో కెనడాలో మాత్రమే భారత మందిరాలపై దాడు లు చేసేవారు. ఇప్పుడు ఆ దాడుల సంస్కృతి ఆస్ట్రేలియా కు వ్యాపించింది. దీనిపై ఆల్బెనీస్‌ స్పందిస్తూ తమ దేశం కూడా పరమత సహనానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంద ని చెప్పారు. ఈ దాడులకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆల్బెనీస్‌ హామీ ఇచ్చారు. అలాగే, ఆస్ట్రేలియాలోని భారతీయుల భద్రతకు శ్రద్ధ తీసుకుంటామని ఆల్బెనీస్‌ హామీ ఇచ్చారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియన్‌ కంపెనీ లు ఆసక్తి చూపుతున్నాయని కూడా అన్నారు.ఆల్బెనీస్‌ పర్యటన ఇరుదేశాలకూ ఆసక్తి కలిగించే పెక్కుఅంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డా యి. వచ్చే సెప్టెంబర్‌లో జరిగే జి-20 సదస్సుకు ఆల్బెనీస్‌ హాజరు కానున్నారు. ఆ సమయంలో కూడా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా మన దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చేసుకుంది.ఈ ఒప్పందాలు ఉభయతారకమైనవే. ఆస్ట్రేలియానుంచి మన దేశానికి దిగుమతులు పెరిగినట్టే, మన దేశం నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు పెరిగాయి. ఆస్ట్రేలి యాలో సిక్కులు 1830 నుంచి ఉంటున్నా, మత పరమై న విషయాల్లో జోక్యంచేసుకునేవారు కారు. భారత్‌లో స్వర్ణాలయంలో పోలీసులు ప్రవేశించిన తర్వాత అటు కెనడాలోనూ,ఇటుఆస్ట్రేలియాలోనూ ఖలిస్తాన్‌ వాదుల చలనం, సంచలనం పెరిగింది.సిక్కులు సాధారణంగా వ్యాపార వ్యవహారాల్లో పాల్గొంటూ ఇతరుల జోలికి వెళ్ళేవారు కారు. స్వర్ణాలయంలో జరిగిన ఘటనలతో సిక్కులు భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో తమ ఉనికి ని ప్రదర్శించుకోవడానికి, తమ మతాన్ని పరిరక్షించు కోవడానికి ప్రదర్శనలు జరపడం ప్రారంభించారు. చైనా విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా మన దేశమూ,జపాన్‌, తదితర దేశాలతో కలిసి క్వాడ్‌ని ఏర్పాటు చేశాయి. క్వాడ్‌ ఏర్పడిన తర్వాత చైనాలో గుబు లు బయలు దేరింది.

మనదేశం రూపొందించిన ఐఎన్‌ ఎస్‌ విక్రాంత్‌ స్వదేశీ విమాన వాహక నౌకను ఆస్ట్ర్రేలియా ప్రధాని ఆల్బెనీస్‌ సందర్శించారు. ఈ నౌకను సందర్శిం చిన తొలి విదేశీ ప్రధాని ఆయనే. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద భారత్‌ వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఆల్బెనీస్‌ హర్షాన్ని వ్యక్తం చేశారు. మన దేశం అంతర్జాతీయ వ్యవ హారాలో ఆచితూచి అడుగులేస్తున్న విధానాన్ని ఆల్బెనీ స్‌ ప్రశంసించారు.ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన సమర్ధించారు. చైనా కార్యకలాపా లు పెరుగుతున్న నేపధ్యంలో చైనా వల్ల ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవ డానికి సమష్టిగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కూడా ఇరువురు ప్రధానులు చర్చలు జరిపారు. అన్నింటికన్నా ఆస్ట్రేలియాలో మత సామర స్యాన్ని కాపాడటానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బెనీస్‌ ఇచ్చిన హామీ చాలా ముఖ్యమైనది. ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్యం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఇరుదేశాలకూ సమానమైన హోదా, సమానమైనగౌరవ ప్రపత్తుల ఆధారంగా వాణిజ్యాన్ని, సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఒప్పందాలు కుదిరాయి. చైనా నుంచి ఎదురవుతున్నసవాళ్ల దృష్ట్యా ఆస్ట్రేలియా మనకు దగ్గరైంది. ఆస్ట్ల్రేలియా నుంచి మన దేశానికి ఎగు మతులు 17.5బిలియన్‌ డాలర్లకు పెరుగగా, మన దేశం నుంచి ఆస్ట్రేలియాకిఎగుమతులు 10.5బిలియన్‌ డాలర్ల కు చేరుకుంది. ఆస్ట్ల్రేలియాలో చదువుకుంటున్న విద్యార్ధి నీ విద్యార్ధుల కోసం మన దేశం ఏటా 4బిలియన్‌ డాలర్ల ను ఖర్చు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement