Thursday, June 8, 2023

ఎడిటోరియ‌ల్ – అదానీ… పిల్లి మొగ్గ‌

వ్యాపార సామ్రాజ్య గగన వీధుల్లో జెట్‌ వేగం… అత్యాశ… అందర్నీ తొక్కేయాలన్న తలంపు… వీటన్నిం టి విష రూపమే అదానీ తాజా స్థితి… అతి సామాన్య స్థితి నుంచి అత్యున్నత స్థితికి ఎదిగిన గౌతమ్‌ అదానీ అకస్మా త్తుగా తనకు ఎదురైన కుదుపుని కల్లో కూడా ఊహించి ఉండరు. ఆయన పట్టిందల్లా బంగారంగా సాగుతున్న జైత్రయాత్రలో హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల కార ణంగా ఒక్కసారిగా కుదేలు అయ్యారు.ఆయన కంపెనీల స్టాక్స్‌ అన్నీ పడిపోయాయి.ఆయనకు రాజకీయంగా అత్యున్నత స్థాయిలో పలుకుబడి ఉన్నప్పటికీ, వాణిజ్యపరంగా,స్టాక్‌ మార్కెట్‌ పరంగా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు.ఆయన షేర్ల విలువలను తిమ్మిని బమ్మిని చేసినట్టు పెంచేసి అక్రమం గా కోటానుకోట్ల లాభాలను ఆర్జించినట్టు హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది.అంతేకాకుండా,జాతీయ వాదం ముసుగులో ఆయన ఈ సంపదనంతా కొల్లకొట్టినట్టు ఆరోపించింది.

- Advertisement -
   

స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారం ఎప్పుడూ ఒడి దుడుకులతో కూడినదే.ఎలా వస్తుందో అలా పోతుం దన్నట్టు ఒక్కసారిగా మార్కెట్‌ డౌన్‌ అవుతుంది. అది అదానీ విషయంలోనే కాదు,అందరికీ అలాంటి అను భవం ఉంటుంది. అయితే,అదానీ ఉచ్ఛ స్థితికి చేరు కొ వడం వల్ల అనుమానాలు పెట్టుకోకుండా ముందుకు సాగారు. అదే ఆయనను పెద్ద దెబ్బకొట్టింది. అమెరికాకి చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణల వల్ల ఆయన పరువే కాదు,భారత్‌ పరువు పోయింది.ఆయనకు అండగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తొలిసారిగా మచ్చ పడింది.ప్రతిపక్షాలకు అది దివ్యాస్త్రం గా అంది వచ్చింది. గురువారం పార్లమెంటును కుదిపే సింది. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెం టరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు జరిపించాలనీ, లేదా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ యేతర పార్టీలన్నీ పట్టుబట్టాయి. ఫలితంగా పార్లమెంటు ఉభయ సభలో ఎటువంటి చర్చ సాగ కుండా వాయిదా పడ్డాయి.
అదానీ వ్యవహారంపై అమె రికా సంస్థ ఆరోపణలు ప్రభుత్వానికి జీర్ణించుకోలేని స్థితి లో ఉన్నాయి. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు లబోదిబో మంటున్నారు. సంస్థలైతే ఈ గడ్డు స్థితి నుంచి ఎలా బయటపడాలా అని తలపట్టు కుంటు న్నాయి. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో జీవిత భీమా సంస్థ ఎల్‌ఐసి కూడా ఉం డటం ఆం దోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా ఖాతా దారుల నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఎల్‌ఐసీ.. అదానీ కంపెనీల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడాన్ని దేశంలో వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిసు ్తన్నాయి. అసలు ఎల్‌ఐసీ మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయడాన్నీ, ప్రభుత్వ నిధులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టడాన్నీ వామమపక్షాలే కాకుండా దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించారు. ఇప్పటికీ వ్యతిరేకి స్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌ అనేది నిత్యం ఒడిదుడుకులతో కూడిన వ్యాపారం. అందువల్ల లాభాలు వచ్చినట్టే వచ్చి గూబగుయ్‌ మనిపించే రీతిలో నష్టాలు తరుముకుని వస్తాయి. ఆదానీ,ప్రధాని నరేంద్రమోడీ గుజరాత్‌కి చెందిన వారు కనుక ఆయనకు మోడీ అండగా నిలుస్తున్నారన్నది అనుమానం కావచ్చు, కానీ, ఎల్‌ఐసీ నిధులు ఆదానీ కంపెనీల్లో పెట్టడం అనేది ప్రధాని అనుమతి లేకుండా జరగ దు.అందువల్లనే ఆయనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలు కురిపిసు ్తన్నాయి. అయితే,ఈ మధ్య కాలంలో మోడీ ప్రసంగాలు పెట్టుబ డుదారులకు అనుకూల వైఖరిని ఆయన తీసుకుంటున్నారన్న అభిప్రాయాన్ని బలపరుస్తు న్నాయి. ముఖ్యంగా,దేశంలో పెట్టుబడులు పెట్టే వారిని దొంగలు గానూ,నేరస్థులుగానూ చూసే ధోరణి పోవాలని ఆయన ఇటీవల చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు.
అంతేకాదు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనీ,తన ప్రభుత్వం ఆ కోణం నుంచే పెట్టబ డులను ఆహ్వానిస్తోందని మోడీ చెప్పారు.తన రాష్ట్రం వారినే తాను ప్రోత్సహిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు.మోడీకి ముందు అధి కారంలో ఉన్న వారు కూడా పెట్టుబడిదారులను ప్రోత్స హించారు. స్వాతం త్య్రం వచ్చిన కొత్తలో టాటా, బిర్లాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ పార్లమెంటులోనూ, వెలుపలా వామపక్షాలు అదే పనిగా ఆరోపించేవి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పెట్టుబడిదారులు మారుతూ ఉంటారన్న నానుడి స్థిరపడింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ, అందిరాని అవకాశాన్నీ అక్రమ పద్దతిలో వినియోగించుకుంటూ, రాజకీయ నిచ్చెన మెట్లెెక్కి ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తే మున్ముందు మరెందరో అదానీలు మనముందు నిలుస్తారు!.

Advertisement

తాజా వార్తలు

Advertisement