Thursday, March 28, 2024

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా ఈడిగ ఆంజనేయగౌడ్‌.. సీఎం కేసీఆర్ నుంచి నియామక పత్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ‘‘తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ” చైర్మన్‌గా డాక్టర్‌ ఈడిగ ఆంజనేయ గౌడ్​ని సీఎం కేసీఆర్‌ నియమించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నియామకపత్రాన్ని సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్‌ అందుకున్నారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా… తెలంగాణ ఉద్యమంలో ఆంజనేయగౌడ్‌ కీలకంగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరు. టీడీపీలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. బీసీ కమిషన్‌ సభ్యుడిగా సేవలందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement