Tuesday, April 23, 2024

మధ్యతరగతి ప్రజలకు రిలీఫ్… భారీగా తగ్గిన వంటనూనెల ధరలు

కొద్ది నెలలుగా భారత్‌లో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో ఈ ప్రభావం సామాన్యులు, మధ్యతరగతి వారిపై ఎక్కువగా పడింది. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి.. వంట నూనె వంటి నిత్యావసర సరకుల ధరలు పెరగడం మరింత భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సామాన్యునికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. వంట నూనెల దిగుమతుల​పై పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వంట నూనెతో పాటుగా, పామాయిల్‌పై పన్ను తగ్గించింది. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. పన్ను తగ్గింపు నేటి నుంచే(జూన్ 17) అమల్లోకి వచ్చినట్టు సీబీఐసీ పేర్కొంది.

మే 7వ తేదీన పామాయిల్ కిలోకు రూ. 142 ఉండగా.. ప్రస్తుతం రూ. 115గా ఉంది. అంటే దాదాపు 19 శాతం ధర దిగి వచ్చింది. మే 5వ తేదీన సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కిలోకు రూ. 188 ఉంటే, ప్రస్తుతం రూ. 157 గా ఉంది. అంటే దాదాపు 16 శాతం ధర దిగి వచ్చింది. మే 5వ తేదీన సోయా ఆయిల్ మే 20వ తేదీన కిలోకు రూ. 162 ఉంటే, ప్రస్తుతం రూ. 138గా ఉంది. అంటే దాదాపు 15 శాతం దిగి వచ్చింది. మే 16న ఆవాల నూనె కిలోకు రూ. 175 ఉంటే, ప్రస్తుతం రూ. 157 గా ఉంది. అంటే దాదాపు 10 శాతం ధర దిగి వచ్చింది. మే 14న వేరుశనగ నూనె ధర కిలోకు రూ. 190 ఉంటే, ప్రస్తుతం రూ. 174 గా ఉంది. అంటే దాదాపు 8 శాతం దిగి వచ్చింది. మే 2న వనస్పతి నూనె ధర కిలో రూ. 154 ఉంటే, ప్రస్తుతం రూ. 141గా ఉంది. అంటే 8 శాతం ధర దిగి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement