Wednesday, February 1, 2023

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూవా-బ్లాస్టింగ్ మూవీ-హాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శంస‌లు

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూశాన‌ని..బ్లాస్టింగ్ మూవీ అని హాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎడ్గ‌ర్ రైట్ ట్వీట్ చేశాడు. . ఆర్ఆర్ఆర్ చిత్రం చూశాక ప్రసంశలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఎడ్గర్ రైట్ హాలీవుడ్ లో ‘లాస్ట్ నైట్ ఇన్ సోహో, బేబీ డ్రైవర్ లాంటి అద్భుత చిత్రాలని తెరకెక్కించారు. యాంట్ మాన్ చిత్రానికి రచయితగా పనిచేశారు. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై భారీ ప్రేక్షకుల మధ్య చూశాను. బ్లాస్టింగ్ లాంటి ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఇంటర్వెల్ కార్డుకి ఈ స్థాయిలో అప్లాజ్ వచ్చిన ఏకైక చిత్రం చూస్తున్నా అని ప్రశంసించారు. మీ నుంచి ఇలాంటి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు క్రేజీగా అనిపిస్తోంది అని ఆర్ఆర్ఆర్ టీం ఎడ్గర్ కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది. ప్రఖ్యాత దర్శకుడు నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు గాల్లో తేలిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement