Monday, October 7, 2024

Karnataka | సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు

కర్ణాటకలోని ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. కర్ణాటకలోకి సీబీఐ రావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ముడా వివాదంలో సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు సోమవారం ఈడీ అధికారులు ప్రకటించారు.

కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement