నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూమి కంపించింది. దీని ప్రమాధ తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ తెలిపింది. భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఇదిలా ఉంటే భూకంపం ధాటికి దోటి జిల్లాలోని గైరాగాన్ ప్రాంతంలో ఇల్లు కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయని, ఆస్తినష్టం సంభవించిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే గతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. వరుసగా ఏదో ఒక చోట భూకంపం సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -