Sunday, April 2, 2023

మే రెండో వారంలో ఎంసెట్‌? త్వరలో షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేసేపనిలో ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మే రెండో వారంలో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఈమేరకు కసరత్తులు చేస్తున్నారు. అయితే మే 15 నుంచి 25 వరకు ఏపీకు సంబంధించిన ఎంసెట్‌(ఈఏపీసెట్‌) పరీక్షలు ఉన్నాయి.

- Advertisement -
   

తెలంగాణ ఎంసెట్‌ను నిర్వహించాలంటే ఏపీ ఎంసెట్‌కు ముందే లేదా తర్వాతే నిర్వహించాల్సి ఉంటుంది. మే 25 తర్వాత నిర్వహించేందుకు అవకాశం లేదు. కాబట్టి మే మొదటి వారం లేదా రెండో వారంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. దాదాపు మే 2 నుంచి 6 లేదా మే 8 నుంచి 12వ తేదీల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంసెట్‌తో పాటు ఐసెట్‌, ఈసెట్‌తో మిగతా సెట్ల షెడ్యూల్‌ళ్లను కూడా ఉన్నత విద్యామండలి త్వరలోనే విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement